రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

  • వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ.69 పెంపు
  • రూ.2.70ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు
  • రైతుల వ‌డ్డీ రాయితీకి రూ.15642 కోట్లు
  • కేంద్ర మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ వెల్ల‌డి

న్యూదిల్లీ, మే 28: కేంద్ర కేబినెట్‌ ‌ రైతులకు శుభవార్త చెప్పింది. వరి (paddy ) మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి మద్దతు ధరను రూ.69ల‌కు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రూ.2369 లకు చేరింది. కేంద్రం మద్దతు ధర కోసం రూ.2.70 లక్షల కోట్లు కేటాయించింది. అంతేకాదు రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించింది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది.ఖరీఫ్‌ ‌సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్‌ ‌సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ ‌వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ‌మీడియాకు వెల్లడించారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్‌ ‌పంటలకు ఎంఎస్‌పీ భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్‌ ‌మార్కెటింగ్‌ ‌సీజన్‌ ‌కోసం ఎంఎస్‌పీ పెంపును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిందన్నారు. ఆయా పంటలకు ఎంఎస్‌పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్‌ ఉం‌డేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ఏపీలోని బద్వేల్‌ ‌నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3653 కోట్లతో 108.134 కిలోమీట‌ర్ల  పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. బద్వేల్‌లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్‌తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోటర్లు తగ్గనుంది. అలాగే, ఈ కారిడార్‌ ‌నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది. వరి సహా మొత్తం 14 ఖరీఫ్‌ ‌పంటలకు క్వింటాల్‌పై కనీస మద్దతు ధర కేంద్రం పెంచింది. వీటిలో వరి సాధారణ, గ్రేడ్ ఏ లకు రూ.69 పెంచగా, జొన్నలు రూ. 328; సజ్జలు రూ.150; రాగులు రూ.596; మొక్కజొన్న రూ.175; కందిపప్పు రూ.450; పెసర రూ.86; మినుములు రూ.400; వేరుశెనగ రూ.480; పొద్దుతిరుగుడు రూ.441; సోయాబీన్‌ ‌రూ.436; కుసుమలు రూ.579; వలిశలు (గడ్డినువ్వులు) రూ.820; పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *