రైతులకు ప్రభుత్వం తీపి కబురు

– సన్న వడ్ల బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: ధాన్యం రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్‌ ‌బకాయిలను క్లియర్‌ ‌చేస్తూ రూ.514.36 కోట్లను విడుదల చేసింది. క్వింటల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ‌రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ది పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం రూ.1,939.58 కోట్ల  బోనస్‌ను చెల్లించింది. రాష్ట్రంలో సన్న బియ్యం సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా .. ధాన్యం కొనుగోళ్లు, బోనస్‌ ‌చెల్లింపులు, ఎమ్‌ఎస్‌పీతో పాటు అదనపు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధుల విడుదలతో పెండింగ్‌ ‌బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్‌ అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ బ్యాంక్‌ ‌ఖాతాలను చెక్‌ ‌చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్‌ ‌సప్లైస్‌ ‌శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. బకాయిల విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *