– డాక్టర్ అనితా రెడ్డి
వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 17: పిల్లలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని, బాలల హక్కులను కాపాడటం అందరి బాద్యత అని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ ఆటోనగర్‌లోని జువెనైల్ హోమ్ (బాలురు పరిశీలన గృహం)లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి పిల్లలకు నోట్ బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం పిల్లలనుద్దేశించి ప్రసంగిస్తూ వివిధ కారణాల చేత ఇక్కడున్న పిల్లలకు మంచి నడవడిక నేర్పడం మన బాధ్యత అని, వీరి మార్పుకు ఎంతో ఓర్పుతో, ప్రేమతో వ్యవహరించాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి హక్కులను కాపాడటం అందరి బాద్యత అని అన్నారు. పిల్లలకు నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించాలని, భద్రతతో కూడిన బాల్యం ఇవ్వాలని తెలిపారు, పిల్లల హక్కులను కాపాడటంలో తనవంతు కృషి చేస్తానన్నారు. పిల్లల హక్కులను కాపాడటం, చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా మార్చడానికి సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే జేజే చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని అన్నారు, మనం అందమైన బాల్యాన్ని పిల్లలకు బహుమతిగా అందించినప్పుడే నిజమైన బాలల దినోత్సవం అన్నారు. భద్రతతో ఎదిగేందుకు అందరం బాసటగా నిలుద్దామని, పిల్లల హక్కులను కాపాడుతామని, పిల్లలు ఒక్కరు కూడా బడి బయట ఉండకుండా చూస్తామని, బాల్య వినాహలు, చైల్డ్ లేబర్ వ్యవస్థను రూపుమాపుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని డాక్టర్ అనితా రెడ్డి సూచించారు జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ రమణమూర్తి, వినయ్, సిబ్బంది పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





