మంచి పాలనతో మన్ననలు పొందాలి

– పంచాయతీల కొత్త పాలకవర్గాలకు సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతారని.. మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతా వేదికగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *