– వరుసగా పెరుగుతున్న ధరలతో రైతుల్లో ఆనందం
– ఇతర పంట ఉత్పత్తులకు ధరలు ఆశాజనకం
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజులు వచ్చాయి. పంట ఉత్పత్తులకు గణనీయంగా ధరలు పలుకుతున్నాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్ చేస్తూ వండర్‌హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సష్టించింది. ఏనుమాముల మార్కెట్‌కు మిర్చి రాబడులు గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కాగా, బుధవారం వండర్‌హాట్ మిర్చి రూ.37,100 ధర పలికి ఆల్‌టైం రికార్డు సష్టించగా, ఒక్క రోజు వ్యవధిలోనే రూ.900 పెరిగి రూ.38వేలు పలకడం విశేషం. వరుసగా రెండు రోజులుగా మిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వండర్‌హాట్, 341 రకాలను సాగు చేసిన రైతులకు మంచి లాభాలు వస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే యూఎస్ 341 రకం మిర్చికి రూ.26,700, దీపిక రకం మిర్చికి రూ.27వేలు, తేజ రకం మిర్చికి రూ.19,500, పత్తికి రూ.7,630, మినుములకు రూ.8,602, పెసర్లకు రూ.8,352 గరిష్ఠంగా ధరలు పలికాయి. కాగా, వరంగల్ మార్కెట్‌లో గురువారం పత్తి ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం రూ.7,700 ఉండగా ఒక్క రోజులో క్వింటాల్‌కు రూ.70 తగ్గి రూ.7,630కి పడిపోయింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




