రాష్ట్రానికి తీరని లోటు

– ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు.. ఆయన రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ..’ చిరస్థాయిలో నిలిచిపోతుంది అని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన రచించిన అనేకమైన గేయాలు రాష్ట్ర ప్రజలు, యువతను ఉర్రూతలూగించాయని, ప్రముఖంగా ‘జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి’ అనే గీతం యావత్‌ తెలంగాణ ప్రజలను మేల్కొలిపి ఉద్యమం వైపు నడిపించిందని పేర్కొన్నారు. రచనల రూపంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. మే నెలలో జరిగిన తమ చిన్న కుమార్తె హర్షిత నిశ్చితార్థం వేడుకలో ఆయన తమతో రెండు గంటలపాటు గడిపారని గుర్తు చేసుకున్నారు. 7వ తేదీన జరిగిన ఆమె వివాహ వేడుకలో సైతం పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారన్నారు. తనను తమ్ముడు అని సంబోధించడం చాలా సంతోషంగా ఉండేదని, ఆయన తుదిశ్వాశ విడిచారని తెలిసి మనస్సుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా నిలవాలని మహేందర్‌రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *