– స్వామి పాదాల వద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవారన్లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, నవంబర్ 7వ తేదీన తమ రెండవ కుమార్తె హర్షిత వివాహం నిహాంత్‌తో జరగనున్న నేపథ్యంలో శ్రీస్వామి వారి పాదాల వద్ద మొదటి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి పూజలు నిర్వహించారు. గొంగిడి దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ప్రొటోకాల్ అధికారి రాజన్ బాబు శ్రీ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీద రవీందర్ గౌడ్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





