– డిగ్రీ పట్టాతో పాటే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ హామీ
– టీసీఎస్ఈ సంయుక్తంగా ప్రత్యేక కోర్సు ప్రారంభం
హైదరాబాద్, ప్రజాంత్ర, ఫిబ్రవరి 7: డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాధించడం ప్రతి విద్యార్థి కల. ఆ కలను సాకారం చేస్తూ డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి వినూత్నమైన ‘జాబ్ అచీవర్ – బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇది విద్యార్ధులకు బంగారు బాట వేయనుందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటికే మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇందులో చేరడానికి మార్చ్ 15 చివరి తేదీగా పేర్కొన్నారు. ప్రొ. చక్రపాణి శనివారం క్యాంపస్ లో టీసీఎస్ ప్రోగ్రాం డైరెక్టర్ లీనా టిప్రే, ప్రతినిధి నరేందర్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, ఓఎస్టీ ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, ప్లేస్ మెంట్ అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి లతో కలిసి పోస్టర్ ను విడుదల చేశారు. ఐటీ, సాఫ్ట్వేర్, కార్పొరేట్ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది గొప్ప వరంగా ప్రొ. ఘంటా చక్రపాణి అభివర్ణించారు. ఈ ప్రోగ్రామ్ కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, టీసీఎస్ తో అనుసంధానమై ఉన్న 3000 పైగా కార్పొ రేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా శిక్షణను ఇస్తుందని వెల్లడించారు. బిజినెస్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, సేల్స్, అడ్మిన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విభిన్న రంగాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యంగా వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




