– 24 క్యారెట్ల ధర 1, 23, 220కి చేరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 :ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది. ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 23, 220కి చేరింది. గతంతో పోల్చుకుంటే దాదాపు రూ.1200 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. రూ. 1, 11, 950కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ.1100 పెరిగింది. ఇటీవల ధర బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక దిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1,23,370కి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,13,100కి చేరుకుంది. ఇక వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. కేజీకి రూ.2,500ల మేర ధర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,67,000గా ఉంది. దిల్లీలో కిలో ధర రూ.1,55,000గా ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





