ముంబై, జనవరి 16: కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి ఊరట మాత్రం కలగడం లేదు. పది గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.220, రూ.200, రూ.170లు తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,620 పలుకుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,31,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,720 వద్ద ట్రేడ్ అవుతోంది. రెండు రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.3,10,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.31,000 దగ్గర ట్రేడ్ అయింది. నేడు కిలోపై రూ.4000 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3,06,000 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.30,600 వద్ద ట్రేడ్ అయింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




