– 24 క్యారెట్ పై రూ.2,940 తగ్గుదల
న్యూదిల్లీ, మార్చి 21: అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. గుడ్ రిటర్నస్ వెబ్‌సైట్ ప్రకారం.. మార్చ్ 20న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండింది. అయితే శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 రూపాయల దగ్గర.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. నిన్న కిలో వెండి 2,60,000 రూపాయల దగ్గర.. 100 గ్రాముల వెండి 26,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు కిలోపై 10 వేల రూపాయలు.. 100 గ్రాములపై వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 25 వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



