– సాధించిన హైదరాబాదీ మెహ్రునిషా బేగం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్I2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్-2026 పోటీలు నోయిడాలో జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. బేగంపేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత కార్గోమెన్ లాజిస్టిక్స్‌లో పనిచేస్తున్న మెహ్రునిషా బేగం జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయస్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయికి చేరుకుని ఈ విజయాన్ని సాధించారు. ఇండియా స్కిల్స్ పోటీలు ప్రాక్టికల్ నేర్పులను, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను ప్రోత్సహించే జాతీయ వేదికగా నిలుస్తున్నాయి. 22 ఏళ్ల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనిలో విజేతలకు వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్‌లో కూడా పాల్గొనేందుకు అవకాశం కలుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





