మళ్లీ షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు

– ఒక్కరోజే రూ.1800ల పెరుగుదల
– వెండి ధ‌ర‌లూ పైపైకే

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: బంగారం కొనాలనుకునే వారికి ధరలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ధరలు శనివారం భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే ఏకంగా పది గ్రాములపై రూ.1800లు పెరిగింది. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,980ల దగ్గర ట్రేడ్‌ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,650ల దగ్గర ట్రేడ్‌ అయింది. 18 క్యారెట్ల ధర రూ.92,900ల దగ్గర ట్రేడ్‌ అయింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,25,840ల దగ్గర, 22 క్యారెట్ల ధర రూ.1,15,350ల దగ్గర ట్రేడ్‌ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.94,380ల దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. 100 గ్రాములపై రూ.300, కేజీపై రూ.3 వేలు పెరిగింది. శుక్రవారం 100 గ్రాముల వెండి ధర రూ.16,100ల దగ్గర, కేజీ ధర రూ.1,61,000ల దగ్గర ట్రేడ్‌ అయింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 100 గ్రాముల వెండి ధర రూ.16,400ల దగ్గర, కేజీ ధర రూ.1,64,000ల దగ్గర ట్రేడ్‌ అయింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *