న్యూదిల్లీ, జనవరి 13 : బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండిపై దృష్టి సారిస్తున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా వీటి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,42,160కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,310కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,42,310కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,30,460కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా భారీగా పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరిగాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





