స్వల్పంగా తగ్గిన బంగారం ధర

– అదే దారిలోవెండి ధరలూ..

న్యూదిల్లీ, నవంబర్‌ 25: అమెరికా కరెన్సీ డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. భారత్‌లో కూడా బంగారం ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్నా కూడా ధరలో కోత పడిరది. దేశంలో మంగళవారం ఉదయం 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,120. నిన్నటి ధరతో పోలిస్తే రూ.463 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్‌ 10 గ్రాముల పసిడి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.650 మేర తగ్గి రూ.1,14,690కు చేరుకుంది. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. సోమవారం ధరతో పోలిస్తే ప్రస్తుతం వెండి రేటు రూ. వెయ్యి మేర తగ్గి రూ.1,62,900కు చేరింది. డాలర్‌ బలపడటంతో బంగారానికి డిమాండ్‌ కాస్త తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌ సూచీ ప్రస్తుతం 100 మార్కుకు పైనే కదలాడుతోంది. గత ఆరు నెలల్లో ఇదే అత్యధికం. దీంతో ఇన్వెస్టర్లకు కమోడిటీ మార్కెట్‌పై ఆసక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఈసారి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం 70 శాతంగా ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడికి మళ్లీ డిమాండ్‌ పెరిగి ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *