గోల్కొండ కోటను సందర్శించిన సిఎస్‌ 

-‌ పంద్రాగస్ట్ ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్13: ‌స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట్‌ ‌ముస్తాబు అవుతోంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే గోల్కొండ కోటలో నేడు జరిగిన ఫుల్‌ ‌డ్రెస్‌ ‌రిహార్సల్స్‌నురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు  పరిశీలించారు. అధికారులతో కలసి ఆయన బుధవారం గోల్కొండకోటను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *