– సీఎస్ రామకృష్ణారావు
హైదాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నిజామాబాద్ కందకుర్తి నుండి బాసర, భద్రాచలం వరకు 8 జిల్లాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందని, ఈ జిల్లాల్లో పుష్కర స్నానాలకు లక్షల సంఖ్యలో భక్తజనం వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి తగు సూచనలు చేశారని, వారి ఆదేశాలకు అనుగుణంగా పుష్కర ఏర్పాట్లపై తగు ప్రతిపాదనలను రూపొందించి గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నియమించిన ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ ప్రతిపాదిత పుష్కర పనులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



