గోదావరి కావేరి అనుసంధానానికి పీట ముడి?

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి అటు దిల్లీ లో ఇటు హైదరాబాద్ లో లెక్క లేనన్ని సమావేశాలు నిర్వహించింది. గోదావరి కావేరి అనుసంధానం అమలుకు సానుకూలంగా అభిప్రాయాలు చెప్పమని భాగస్వామ్య రాష్ట్రాలను కోరేది. జానపద కథలో విక్రమార్కునికి తడవ తడవకు శవం ఒక్కో కథ చెప్పినట్లు గోదావరి కావేరి అనుసంధానం గురించి జరిగే ప్రతి సమవేశంలో ఒక్కోసారి ఒక్కో రాష్ట్రం కొత్త డిమాండ్లు కేంద్రం ముందు ఉంచుతున్నాయి.   

ఈ తరం వారికి తెలియదు గాని వెనక రోజుల్లో వెలువడుతుండిన చందమామ మ్యాగజైన్ లో భట్టి విక్రమార్క కథలు సీరియల్ గా వచ్చేటివి. చెట్టుపైన ఉన్న శవాన్ని విక్రమార్కుడు భుజంపై వేసుకొని వెళ్లుతుంటే శవం ఒక కథ చెప్ఫి ముగింపు లో నిజం చెప్పమని కోరి నిజం తెలిసి అబద్ధం చెబితే తల వేయి ముక్కలు అవుతుందని షరతు పెట్టేది. తీరా విక్రమార్కుడు నిజం చెప్పగానే శవం వెళ్లి చెట్టుపై ఉండేది. ఇలా కథలు సంవత్సరాల తరబడి సాగాయి . ఇప్పుడు కూడా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి అటు దిల్లీ లో ఇటు హైదరాబాద్ లో లెక్క లేనన్ని సమావేశాలు నిర్వహించింది. గోదావరి కావేరి అనుసంధానం అమలుకు సానుకూలంగా అభిప్రాయాలు చెప్పమని భాగస్వామ్య రాష్ట్రాలను కోరేది. జానపద కథలో విక్రమార్కునికి తడవ తడవకు శవం ఒక్కో కథ చెప్పినట్లు గోదావరి కావేరి అనుసంధానం గురించి జరిగే ప్రతి సమవేశంలో ఒక్కోసారి ఒక్కో రాష్ట్రం కొత్త డిమాండ్ లు కేంద్రం ముందు ఉంచుతున్నాయి.

ఆగస్ట్ 22 తేదీ హైదరాబాద్ లో జరిగిన సమావేశం గురించి విడుదలైన మినిట్స్ పరిశీలించితే చిత్ర విచిత్రంగా ఉంది . తమాషా ఏమంటే బిజెపి అధికారంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ ఇంత వరకు తటపటాయించుతూ ఉండినా ఈ సమావేశంలో ఖచ్చితమైన వైఖరి తీసుకొని తమ వాటా నీళ్లు 148 టిఎంసిలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడమే. అంతేకాదు. ఇచ్చంపల్లి నుండి గోదావరి కావేరి అనుసంధానం మొదలు పెడితే తమ రాష్ట్రంలో ముంపు ఎక్కువగా ఉంటుందని వ్యతిరేకించింది. ఛత్తీస్గఢ్ తీసుకున్న వైఖరితో అనుసంధానం అటకెక్కే ప్రమాదం ఏర్పడింది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘమే ఇది వరకు స్పష్టం చేసినందున వాస్తవంలో ఏ నీళ్లు తరలించినా ఛత్తీస్ ఘడ్ వాటా పేరుతో నాటకం రక్తి కట్టించాలనుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆగస్ట్ 22 వతేదీ హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ డొంక తిరుగుడు మంత్రం ప్రయోగించారు. ఛత్తీస్గఢ్ వాటా నీళ్లు వాడుకోవడం లేదని వచ్చే 15 ఏళ్ల కాలంలో ఇంద్రావతి ఎగువ భాగంలో గల మిగులు నీళ్లు వాడుకొంటామని సర్ది చెప్పారు. ఏది ఏమైనా ఛత్తీస్గఢ్ అంగీకారం పైననే గోదావరి కావేరి అనుసంధానం ఒక్క అడుగు అయినా ముందుకు సాగుతుంది.

ఇదిలా ఉండగా తెలంగాణ ఇచ్చంపల్లి నుండి అనుసంధానానికైతే అంగీకరించింది గాని తరలించే నీటిలో 50 శాతం వాటా తమకు కేటాయించాలని కోరడం అడ్డంకిగా ఏర్పడింది. ఇందుకు అతుల్ జైన్ అంగీకరించలేదు. తెలంగాణ అంతవరకే కాకుండా గోదావరి వరద జలాలు 200 టిఎంసిలు వాడు కొనేందుకు అంగీకరించాలని కూడా కోరింది. మున్ముందు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బనకచర్ల అనుసంధానం అంగీకరించితే తాము మాత్రం వరద నీళ్లు ఎందుకు వాడుకోకూడదని ఈ ప్రతిపాదన చేసినట్లుంది. దీనితో పాటు గోదావరి నదిపై తమ రాష్ట్రం ప్రతిపాదన చేసిన ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కోరింది. పైగా కర్ణాటక కూడా అందరితో సమానంగా తమకు నీటి వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. కాగా మహారాష్ట్ర కూడా తమను భాగస్వామి చేయాలని కోరింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బనకచర్ల అనుసంధానం కట్టడి చేసే ఉద్దేశంతో ఇచ్చంపల్లి నుండి అనుసంధానం అంగీకరించినందుకే బిఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి అమ్ముడు పోయాడనే ప్రచారం మొదలు పెట్టారు. అందులో 50 శాతం కాకుండా తగ్గించి నీటి వాటాకు అంగీకరించితే బిఆర్ఎస్ పార్టీ మరింత రెచ్చగొట్టే చర్యలకు దిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా తెలంగాణ ఎక్కువ డిమాండ్ లు పెట్టినట్లుంది.

వీరందరి మధ్య ఆంధ్ర ప్రదేశ్ ఇతర ఎన్ని పద్ధతులు చేపట్టినా అంగీకరించే. అవకాశాలు ఉన్నాయి. బనకచర్ల అనుసంధానం అంగీకారం లభించితే సర్దుకు పోవచ్చు. కానీ ఆ పరిస్థితి కన్పించండం లేదు. ఆగస్ట్ 22 వతేదీ జరిగిన సమావేశంలోనే అతుల్ జైన్ ఈ అనుసంధానంతో సంబంధం లేదని చెబుతూ బనకచర్ల అనుసంధానం గురించి ప్రస్తావించితే తెలంగాణ తీవ్ర అభ్యంతరం పెట్టినట్లు మినిట్స్ లో ఉంది . ఇప్పటి పరిస్థితి పరిశీలించితే బనకచర్ల అనుసంధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొనేట్టు లేదు. ఏ మాత్రం ఆంధ్ర ప్రదేశ్ వైపు మొగ్గు చూపితే తెలంగాణలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బిజెపి ని బదనాం చేసే అవకాశం ఉంది కాబట్టి తటస్థంగా ఉంటోంది. ముఖ్యమంత్రుల సమావేశంలో వివాదాల పరిష్కారానికి కమిటీలో ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కమిటీ నియామకం కూడా జరిగేటట్టు కనిపించడం లేదు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో సరికొత్త డిమాండ్ లు లేకుండా పాల్గొన్నది ఒక్క తమిళనాడు మాత్రమే. ఏదిఏమైనా గోదావరి కావేరి అనుసంధానం ఒక అడుగైనా ముందుకు సాగాలంటే ఛత్తీస్ ఘడ్ మెత్త బడాలి. తెలంగాణ సమావేశంలో పెట్టిన కొన్ని డిమాండ్ల నుండి వెనక్కి తగ్గితే తప్ప సాధ్యం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page