గోదావరికి పోటెత్తిన వరద

– నీట మునిగిన బాసర వీధులు

ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:‌నిర్మల్‌ ‌జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వరదనీరు వ్యాసమహర్షి ఆలయానికి, ఆలయ ఆవరణలోని తితిదే గృహాల వరకు చేరుకుంది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జ్‌లు, సత్రాలన్నీ నీట మునిగాయి. దీంతో సరుకులు మొత్తం నీటిలో కొట్టుకు పోయాయని దుకాణదారులు విలపించారు. గంగాదేవి, సూర్యేశ్వర శివాలయం, అక్షర కాలనీ, ఎస్‌బీఐ, యూనియన్‌ ‌బ్యాంక్‌లు జలమయమయ్యాయి. అక్షర కాలనీలో చిక్కుకున్నవారిని ట్రాక్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక నాగభూషణ్‌ ‌విద్యాలయంలో 30 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు చిక్కుకున్నారు. వరద చుట్టు-ముట్టడంతో భవనం పై అంతస్తుకు వెళ్లి తలదాచుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లి మరో 8 మంది కూడా వరదనీటిలో చిక్కుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *