– అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్‌కు మద్దతు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 తెచ్చిన జీవో 68 ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతోపాటు జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని, ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్‌తో సమావేశమై,వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు ఇంకా పనిచేస్తున్న ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి హోర్డింగ్‌లను తొలగించడానికి ప్రయత్నిస్తోందని, దీని కారణంగా సుమారు 50వేల కుటుంబాల జీవనోపాధి ప్రభావితమవుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జీవో 68ని రద్దు చేయాలని అవుట్‌డోర్ మీడియా ఓనర్స్‌కు మద్దతుగా బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను అంగీకరించి తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే 21 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. హోర్డింగ్ పరిశ్రమపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని ఆపాలని, పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కోల్పోకుండా భరోసా కల్పించాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





