-సంక్రాంతి సందర్భంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
– అన్ని చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్
- అధికారులతో కలసి సక్షించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7:
నూతన పర్యాటక విధానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్త సమతుల్య అభివృద్ధి కోసం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించామని జూపల్లి అన్నారు. టూరిజం కాంక్లేవ్, గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.22,324 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా సుమారు 90,000 ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో 19.44 మీటర్ల అతిపెద్ద బతుకమ్మ, 1,354 మంది మహిళలతో నృత్యం ద్వారా రెండు గిన్నిస్ రికార్డులు సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశామన్నారు. మిస్ వరల్డ్ వేడుకలు, గ్లోబల్ సమ్మిట్‌ల నిర్వహణతో తెలంగాణ పెట్టుబడులకే కాదు, వ్యాపారానికి, పర్యటనకు అత్యంత ’సురక్షితమైన రాష్ట్రం’ అని నిరూపించాం అన్నారు. మన పండుగలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ సంక్రాంతికి ’అతిథి దేవోభవ’ అనే ఆత్మీయ సంస్కారంతో ఆతిథ్య రంగం సిద్ధంగా ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ ఉత్సవంలో ఇండోనేషియా, ఆస్టేల్రియా, కెనడా, శ్రీలంక, కంబోడియా, థాయిలాండ్, కొరియా, జపాన్, పోర్చుగల్, వియత్నాం, మలేషియా, ఇటలీ, స్విట్జర్లాండ్, అల్జీరియా, సింగపూర్, రష్యా, ఉక్రెయిన్/ఫ్రాన్స్ వంటి 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అలాగే భారతదేశంలోని 15 రాష్టాల్ర నుండి 55 మంది జాతీయ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటారు. రాత్రివేళ ఆకాశంలో వెలుగులు విరజిమ్మే ’నైట్ ఫ్లయింగ్’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ కానుందని అన్నారు.
సాంప్రదాయ కళా రూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేలా రాష్ట్ర సాంప్రదాయ కళా రూపాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేదిక వద్ద సుమారు 100 చేనేత, హస్తకళల స్టాల్స్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రుచులతో కూడిన 60 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ సహకారంతో జరిగే ఈ ఉత్సవంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన వారు 16 నుండి 18వరకు తమ ఇళ్లలో తయారు చేసిన 1,200 కంటే ఎక్కువ రకాల మిఠాయిలను ప్రదర్శిస్తారనన్నారు. ఐరోపా దేశాలకు నుంచి వచ్చే ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి 15 బెలూన్లతో ప్రదర్శన. ఉదయం పూట హైదరాబాద్ శివార్లలో, సాయంత్రం వేళ పరేడ్ గ్రౌండ్స్‌లో ’నైట్ గ్లో బెలూన్స్’ ప్రదర్శన ఉంటుందన్నారు. 16/17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక డ్రోన్లు, మల్టీ-కలర్ ఎల్‌ఇడి లైట్లు, గగనతల విన్యాసాలతో ఈ షో సాగనుంది. ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వం నుండి ఆధునిక ఆవిష్కరణల వరకు సాగిన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ – సోమశిల – శ్రీశైలం సర్క్యూట్‌లో పూర్తిస్థాయి హెలీ టూరిజం సేవలు అందుబాటులోకి వస్తాయి. నాగార్జున సాగర్, సోమశిల, బస్వాపూర్ ప్రాంతాలను ప్రపంచస్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్లుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా మార్చడానికి ప్రత్యేక సొసైటీ స్థాపన చేస్తున్నామన్నారు. పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ అందుబాటులోకి వస్తుందన్నారు. వారసత్వ కట్టడాల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ మా ప్రభుత్వ బాధ్యత. మన పర్యాటకానికి యువత, టెక్కీలు, మీడియా, సెలబ్రిటీలు మరియు ఇన్‌ప్లుయెన్సర్లు రాయబారులుగా మారి ’తెలంగాణ జరూర్ ఆనా’ అంటే తెలంగాణకు తప్పక రండి అనే ఆత్మీయ పిలుపును ప్రపంచానికి చాటాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





