గ్లోబల్‌ సమ్మిట్‌ ఎగ్జిబిషన్‌ అందుబాటులోకి..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరఠ్‌ 4: ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ -విజన్‌ 2047 పబ్లిక్‌ ఎగ్జిబిషన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను, గ్లోబల్‌ విజన్‌ను దగ్గరగా చూసే అద్భుత అవకాశం లభించింది. రండి.. వీక్షించండి.. తెలంగాణ గ్లోబల్‌ విజన్‌లో భాగస్వాములు కండి.

ఎగ్జిబిషన్‌ తేదీలు : ఈనెల 10 నుండి 1 రండి..3 వరకు
వేదిక ఎక్క‌డ‌? : ఫ్యూచర్‌ సిటీ, హైదరాబాద్‌
ప్రవేశం: అందరికీ ఉచితం!
ఏముంటాయి?: భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించవచ్చు.
ఉచిత బస్సు సేవ: ఎగ్జిబిషన్‌ వీక్షించేందుకు ప్రభుత్వం ప్రతిరోజూ ప్రత్యేక ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు (వెళ్లేందుకు), సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు (తిరిగి వచ్చేందుకు) నడుస్తాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఎల్‌బి నగర్‌ వంటి ప్రధాన కేంద్రాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం ప్రభుత్వ ప్రకటనలను గమనించగలరు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *