– అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సబ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సి.ఎం.ఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ ఈ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖులకు, దేశ, విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపిస్తున్నామని, ఈ సమ్మిట్‌కు హాజరయ్యే వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఈ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా ప్రజా భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిర్వహించే అతిపెద్ద సమ్మిట్‌లో రాష్ట్రానికి చెందిన అన్ని శాఖలు తమ పురోగతిని షో కేస్ చేయాలన్నారు. ప్రధానంగా ప్లీనరీ, ముఖ్యమంత్రిచే వన్ టు వన్ సమావేశాలు, వివిధ సంస్థలతో ఎంఓయూ అనే ప్రధాన అంశాలుంటాయని తెలిపారు. ఈ సమ్మిట్‌లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 13 తేదీ వరకు ఈ సమ్మిట్ కొనసాగుతుందని, 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ముగుస్తుందని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





