ఈ సృష్టిలో నింగి నేల ఎంత ప్రధానమో గాలి నీరు కూడా అంతే ముఖ్యమైనవి. ఈ భూమిపై నేడు కలుషితం లేని నీరు లేదు గాలి లేదు ఎందుకంటే పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త వస్తువు తయా రు చేయా లంటే దాని నుండి వచ్చే వ్యర్థాలు నదులు, సముద్రాలు, గాలిలో కలుస్తూ మొత్తం కలుషితం అవుతున్నాయి. రోజు రోజుకు ఓజోన్ పొర కూడా క్షీణిస్తుంది. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుందని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. దేశంలో ఆహార పదార్థాల విషయానికి వస్తే పిల్లలు తాగే పాల నుండి మాంసకృత్తుల వరకు మొత్తం కల్తీ జరుగుతుంది. ప్రస్తుతం పుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీలలో హోటల్స్, రెస్టారెంట్ లలో కల్తీ ఆహార పదార్థాలు వాడుతున్నట్లు బయట పడుతుంది. నాణ్యత లేని ఆహార పదార్థాలు తిని ప్రజలు అస్తవ్యస్తకు గురయ్యే ప్రమాదం ఉందని దీంతో పాటు దీర్ఘకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కావున సంబంధిత అధికారులు నిరంతరము తనిఖీలు చేస్తూ సాధ్యమైనంత వరకు కల్తీని నియంత్రించాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండే చూడాలి. నేడు ఫ్యాక్టరీలు, ఇంధనాల నుండి వచ్చే వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నా యంగా సోలార్, ఎలక్ట్రానిక్ వాహనాలను వాడుతూ కాలుష్య నియంత్రణకు సహకరించాలి. ఆహార కల్తీ అనేది ఆహార పదార్థాలు లేదా పానీయాలలో కలుషి తాలను చేర్చి, పదార్థ పరిమాణాన్ని పెంచడానికి, వస్తువుల ధరను తగ్గించడానికి నాణ్యత లేని వాటిని వాడుతున్నారు. భారతదేశంలో కలుషితం, కల్తీ ప్రధాన సమస్యగా మారింది. ఇది ఆహారం యొక్క నాణ్యతను తగ్గిస్తూ మానవులు, జంతువులలో తీవ్రమైన అనారోగ్యాలకు మూల కారణం అవుతుంది. ఈ సమస్యలను అరికట్టడానికి ఇంకా కొత్త చట్టాలను తీసుకు వస్తూ ఉన్నటువంటి చట్టాలను తప్పక అమలు చేస్తే కొంత వరకైనా కాలుష్యాన్ని కల్తీని ఆరికట్టవచ్చు. భారతదేశంలో 1899 నుండి ఆహార కల్తీ చట్టాలు చట్టంలో ఉన్నాయి. ఇది స్వాతంత్య్రనికి పూర్వం కాబట్టి, రాష్ట్రాలు మరియు ప్రావిన్సులు ఆహార కల్తీని నిరోధించడానికి వారి స్వంత నియమాలు నిబంధన లను కలిగి ఉన్నాయి. రాష్ట్ర లేదా ప్రావిన్స్ – నిర్దిష్ట చట్టాలు ఏ విధమైన ఏకరూపత లేని అనేక చట్టాలు నిబంధనలున్నాయి.
ఈ చట్టాలు అంతరాష్ట్ర ఆహార ప్రచార రవాణాకు అడ్డంకిగా మారింది. ఈ చట్ట, నిబంధన విశ్లేషణ శిక్ష అమలు ప్రమాణాల పద్ధతులు మధ్య వ్యత్యాసం ఉంది. ఇది ఆహార కల్తీని నిరోధించడానికి కేంద్రంగా వ్యవస్థీకృత చట్టాని తీసుకురావడానికి దోహద పడిరది. 1943లో భారత ప్రభుత్వం ఆహార కల్తీ కమిటీని ఆమోదించింది. కమిటీ ఆహార కల్తీకి సంబంధించిన అంశాన్ని అధ్యయనం చేసి సమీక్షించి కేంద్ర చట్టానికి సలహా ఇచ్చింది. ఆ విధంగా ఆహార కల్తీ నిరోధక చట్టం (పీఎఫ్‌ఏ) చివరకు 1954లో ఆమోదించింది. భారతదేశం మొత్తం ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 లో విస్తరించింది. ఈ చట్టం 1955 జాన్ 15 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం కల్తీని నిర్వచిస్తూ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో తెలియజేయడం ద్వారా అధికారిక ప్రతినిధిని నియమించవచ్చు. పుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించిన కల్తీని ప్రయోగశాలకు పంపడం జరుగుతుంది. ఆహార కల్తీ అనేది వివిధ కారణాల వల్ల జరుగుతుంది. ఆహార ఉత్పత్తులకు విదేశీ లేదా నాసిరకం పదార్థాలను ఉద్దేశపూర్వకంగా చేర్చడం వల్ల మిక్సింగ్, ప్రత్యామ్నాయం, ప్యాకేజింగ్ మెటీరియల్‌లో నాసిరకం నాణ్యతను దాచడం, కుళ్ళిన ఆహారాన్ని అమ్మకానికి పెట్టడం, తప్పుగా బ్రాండ్ చేయడం లేదా తప్పుడు లేబుల్‌లను ఇవ్వడం వంటి అనేక రూపాల్లో కల్తీ జరుగుతుంది.
ఆహార పదార్థాల నాణ్యతను గుర్తించడానికి అనేక విశ్లేషణాత్మక పద్ధతులను తీసుకు వచ్చారు క్రోమాటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రానిక్ సెన్సార్లు వంటివి ఉపయోగిస్తారు. కల్తీ ఆహారం యొక్క పరిధి స్థాయిని అర్థం చేసుకోవడానికి సంక్షిప్తమైన వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఆహార కల్తీకి సంబంధించిన కారణాలు ప్రమాదాలు గురించి పూర్తి స్థాయిలో చర్చిస్తుంది. కల్తీ ఆహార ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని గుర్తించి నిరోధించడం జరుగుతుంది. ఆహార కల్తీపై పుస్తకాలు, నియంత్రణ, మార్గదర్శకాలు, కథనాలు, నివేదికలను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తారు. ఆహార కల్తీని ఎదుర్కోవడానికి సంబంధించిన సవాళ్లు సూచిస్తూ సమీక్ష తదనతరం కీలక ఫలితాలను అంచనా వేస్తుంది. ఈ సమీక్షలో ఆహార కల్తీకి సంబంధించిన అనేక కారణాలు ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి. ఆహార కల్తీని గుర్తించడానికి విశ్లేషణాత్మక పద్ధతులు కూడా క్లుప్తంగా నమోదు చేయబడ్డాయి. అదనంగా నియంత్రణ చర్యలు సాంకేతిక పురోగతిని వినియోగదారుల అవగాహన కలయిక ద్వారా ఆహార కల్తీని పరిష్కరించాల్సిన ఆవశ్యకతను సమీక్ష నొక్కి చెప్పింది. కల్తీ ఆహరం వల్ల క్యాన్సర్, కాలేయ వ్యాధి, హృదయ సంబంధ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధి మరియు నాడీ వ్యవస్థ సంబంధించిన వంటి అనేక దీర్ఘ కాల వ్యాధులకు కారణమవుతుంది.
ఇలాంటి ఎన్నో సమస్యలు ఉత్పనం అవుతున్నాయి కాబట్టి ఆహార భద్రతను నిర్ధారించడం అనేది సంబంధిత అధికారుల భాధ్యత. ఆహార పదార్థాల నాణ్యతకై క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వలన కొంత వరకైనా మార్పు తీసుకురావచ్చు. కల్తీ ఆహార పదార్థాలు నిత్యం మార్కెట్‌లోకి వస్తున్నాయి. వివిధ పదార్థాల తయారీలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారీ తేదీ చివరి తేదీ లేకుండానే మార్కెట్ లో అమ్ముతున్నారు. నేడు జీవ నదులైన గోదావరి, తుంగభద్ర, కృష్ణ, కావేరి వంటి నదులు వ్యర్థాలతో నిండిపోయాయి అదే నీరును శుద్ధి చేసి త్రాగునీరుగా వాడుతున్నాము. పెద్ద పెద్ద ప్యాక్టరీల నుండి వచ్చిన వ్యర్థాలను నదులలో కలుపుతున్నారు అలా కలువ కుండా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో కలుషిత నీటిని వ్యవసాయానికి వాడుతున్నారు.
దీంతో పంట దిగుబడి తగ్గడమే కాకుండా నాణ్యత కోల్పోతుంది. సముద్ర తీరాల వెంట కూడా సందర్శకులు వాడిన కవర్లు, వ్యర్థ పదార్థాలు ఎక్కడ అంటే అక్కడ వేస్తున్నారు సముద్ర తీర ప్రాంతాలు కూడా వ్యర్థాలతో నిండి పోయినవి. నదులు, సముద్రాలలో ఉండే జీవ రాసులు సైతం కలుషిత నీటికి మృత్యువాత పడుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన వంతుగా సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా స్వదేశీయులు తయారు చేసిన బట్ట సంచులను ఉపయోగిస్తూ చేతి వృతుల వారు తయారు చేస్తున్న మట్టి పాత్రలు, వెదురు బొంగుతో తయారు చేసిన బుట్టలు వాడుతూ వారి ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఆనాడు గాంధీ చెప్పినట్లు స్వదేశి వస్తువులను మాత్రమే ఉపయోగిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలుషితం, కల్తీపై నియంత్రణకు కఠినమైన నిబంధనలు తీసుకువచ్చి సమర్థవంతంగా అమలు చేసినప్పుడే కొంత వరకైన నియంత్రించి సకల జీవరాసులను కాపాడగలము.
మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త
9701209355





