– డీజీపీకి హక్కుల కమిషన్ నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మొయినాబాద్‌లో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ నుంచి తెలంగాణ హక్కుల కమిషన్(టీజీహెచఆర్‌సీ) నివేదిక కోరింది. భూ వివాదం నేపథ్యంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో 163మంది న్యాయవాదులు టీజీహెచఆర్‌సీలో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన గల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. మృతురాలు తన సోదరుడిని నిందితుడిగా పేర్కొంటూ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగా ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో నివారణ చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇది విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించాల్సిన విషయమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ నుండి సమగ్ర నివేదిక కోరుతూ కేసును తదుపరి పరిశీలన కోసం మార్చి 6కి హక్కుల కమిషన్ వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




