– ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు మంద కృష్ణ మాదిగ లేఖ
వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 4: రాజ్యసభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానం మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎస్సీ స్థానాలైన పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కూడా మాదిగలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పార్లమెంట్‌లో మాదిగలకు ప్రాతినిధ్యం లేదన్నారు. ఇప్పుడు రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానం నుంచైనా అవకాశం కల్పించాలని మంద కృష్ణ మాదిగ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





