– కేంద్ర మంత్రిని కోరిన పొన్నం ప్రభాకర్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 24: తెలంగాణలో గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దిల్లీలో తన్మయికుమార్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మే 2025లో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని, దీనిపై న్యాయ సలహా తీసుకొని అనుమతుల మంజూరు చేస్తామని తన్మయికుమార్ చెప్పినట్టు మంత్రి వివరించారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని వివరించినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విదేశాల్లో ఉన్న కారణంగా తన్మయికుమార్‌ను కలిసి ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చించినట్టు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





