- మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేయాలి.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- సీఎం తో రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ
ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు.
కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్స్ నిధులు మార్చి 31వ తేదీ లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వొచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించిన నాబార్డు చైర్మన్ సూచించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు





