– డీటీఎఫ్ రాష్ట్ర శాఖ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: విద్యాహక్కు చట్టం అమలు కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, అందుకవసరమైన చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలన్నా, ప్రమోషన్ పొందాలన్నా తప్పకుండా ‘టెట్’ ఉత్తీర్ణులు కావాలనే నిబంధన వల్ల ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్‌లో వాస్తవ పరిస్థితులు వివరించాలని, అదేవిధంగా విద్యాహక్కు చట్టంలో అవసరమైన సవరణలు చేయాలని కోరారు. ‘టెట్’ సిలబస్ కూడా అశాస్త్రీయంగా ఉందని, బోధించే సబ్జెక్టుకు సంబంధం లేని విషయాలపై పరీక్ష పెట్టడం సరికాదని అన్నారు. అలాగే కేటగిరీల వారీగా ఉతీర్ణతా మార్కుల శాతం కూడా చాలా ఎక్కువగా ఉందని, వాటిని కూడా హేతుబద్ధీకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు 35శాతం, బీసీలకు 40శాతం, ఓసీలకు 50 శాతం మార్కులను కనీస ఉత్తీర్ణతగా పరిగణించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ డైరెక్టర్‌లకు వినతిపత్రాలు పంపినట్లు సోమయ్య, లింగారెడ్డి లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





