స్కూల్‌లో గుండెపోటుతో బాలిక మృతి

– అప్పుడు అన్న.. ఇప్పుడు చెల్లి

జయపుర, ఫిబ్రవరి 26:  తొమ్మిదేళ్ల బాలిక స్కూల్‌లో ఆడుకుంటూ కార్డియ‌క్‌ అరెస్ట్‌తో కుప్పకూలి పోయింది. రాజస్థాన్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్డియ‌క్‌ అరెస్ట్ ‌కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరో విషాదకర విషయం ఏంటంటే.. ఆ బాలిక అన్న కూడా కొన్ని నెలల కిందట కార్డియాక్‌ అరెస్ట్ ‌కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ ‌జిల్లాకు చెందిన రాజేంద్ర బపేడియా అనే వ్యక్తి తొమ్మిదేళ్ల కూతురు దివ్య స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్‌ ‌స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఈనెల 23వ తేదీన ఎప్పటిలాగానే దివ్య స్కూల్‌కు వచ్చింది. ఉదయం ప్రేయర్‌ ‌సమయానికి ముందు తోటి పిల్లలతో కలిసి స్కూల్‌ ‌గ్రౌండ్‌లో ఆడుకుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి దివ్య కుప్పకూలిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆ బాలికను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది . బాలిక శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు. దీంతో ఆ బాలిక కార్డియ‌క్‌ అరెస్ట్ ‌కారణంగానే చనిపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. దివ్య అన్న అభిషేక్‌ ‌కూడా కొన్ని నెలల కిందట ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా దివ్య కూడా అదే తరహాలో ప్రాణాలు కోల్పోయింది. నెలల వ్యవధిలోనే రాజేంద్ర కుటుంబం ఇద్దరు పిల్లలనూ కోల్పోవడం తో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *