గిరియానం – 12
అక్కడి నుంచి హాన్ కీమ్ సరస్సుకు వెళ్ళాం. ఈ సరస్సును హనోయ్ ఆత్మగా స్థానికులు భావిస్తారట. నగరం నడి బొడ్డులో ఉంది. చుట్టూ అందమైన పూలతోటలు ఉన్నాయి. సరసన మధ్యలో టవర్ లాంటి ప్రాచీన కట్టడం ఒక’టి ఉంది. ఇది ప్రఖ్యాత ప్రాచీన చారిత్రక, సాంస్కృతిక సరస్సు. 15 వ. శతాబ్దంలో లే లోయి అనే చక్రవర్తి సరస్సు మధ్యలో ఉన్న తన విశ్రాంతి మందిరంలో ఉన్నప్పుడు ఒక తాబేలు బంగారు ఖడ్గాన్ని ఆయనకు ఇచ్చినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది.
కాంబోడియా, వియత్నాం వెళ్లాలనే ఆలోచన ఉన్నా సమయం చాలదనే ఉద్దేశంతో వియత్నాం మాత్రమే వెళ్ళాను.హైదరాబాదు నుంచి ముగ్గురం, గుంటూరు నుంచి ఆరుగురు తొమ్మిది మంది బృందం. అందరూ మహిళలే.. ఇద్దరు యాభై ఏళ్ళ వాళ్ళయితే ఇదరం అరవైలో ఉన్నవాళ్ళం. మిగతా ఐదుగురు డెబ్భైయేళ్ళు పైబడినవారు. వాళ్ళు ఒంటరిగా ప్రయాణించడం స్ఫూర్తిదాయకంగా ఉంది . మూడోతేది రాత్రి హైదరాబాదు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి డిసెంబర్ నాలుగో తేదీ ఉదయం 5. 45 లకు హనాయ్ లో దిగిపోయాం. లగేజీ తీసుకొని బయటకు వచ్చేసరికి మేం ఏర్పాటు చేసుకొన్న వాహనంతో డ్రైవర్ చిన్ గో సిద్ధంగా ఉన్నాడు.
వియత్నాం చారిత్రకంగా, సాంస్కృతికంగా, ప్రకృతిపరంగా చూడదగిన దేశం. ఇండియాకు అది దగ్గరలో ఉన్న దేశం. కలకత్తా నుంచి హోచిమెన్ కు విమానంలో రెండుగంటల ప్రయాణం. మన హైదరాబాదు నుంచి కలకత్తా కూడా అంతేదూరం. వియత్నాంలో ముఖ్యంగా చూడదగిన ప్రాంతాలైన హనోయ్, హా లాంగ్ బే, డనాoగ్, హోచిమెన్ సిటీ చూడాలని ప్రణాళిక వేసుకున్నాం.
హోటల్ కు వెళ్ళిపోయాం. మా టూర్ ఆర్గనైజర్ ఏప్రిల్ వచ్చి కలిసింది. గదిలో కాసేపు విశ్రాంతి తీసుకొని, బ్రేక్ ఫాస్ట్ ముగించేసరికి వాహనం, గైడ్ లియాన్ సిద్ధంగా ఉన్నది. లియాన్ వయసు ముప్ఫైయేళ్ళు. వియత్నాం రాజధాని హానోయ్. అభివృద్ధి చెందుతున్న నగరం. అక్కడ ఏడు శాతం క్రిస్టియన్స్, పధ్నాలుగు శాతం బుద్ధిస్టులు, ఒక శాతం ముస్లింలు ఉన్నారని లియాన్ చెప్పింది. మేము ముందుగా బా దిన్ స్క్వేర్ కు వెళ్ళాం. ఇది హనోయ్ లోని బా దిన్ జిల్లాలో ఉన్నది. ప్రముఖ చారిత్రక, రాజకీయ ప్రదేశం.1945 సెప్టెంబర్ రెండో తేదీన హోచిమెన్ వియత్నాంకు స్వాతంత్ర్యం ప్రకటించిన ప్రదేశo కాబట్టి ఇప్పటికీ ఇక్కడనే జాతీయ వేడుకలు, పరేడ్ లు నిర్వహిస్తారని గైడ్ లియాన్ చెప్పింది. జెండా పండుగ పేరిట ప్రతిరోజూ సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో జెండా ఎగుర చేస్తారట. దీనిని వియత్నాం భాషలో నియాహామ్ అంటారట. అక్కడి నుంచి హాన్ కీమ్ సరస్సుకు వెళ్ళాం. ఈ సరస్సును హనోయ్ ఆత్మగా స్థానికులు భావిస్తారట. నగరం నడి బొడ్డులో ఉంది. చుట్టూ అందమైన పూలతోటలు ఉన్నాయి. సరసన మధ్యలో టవర్ లాంటి ప్రాచీన కట్టడం ఒక’టి ఉంది. ఇది ప్రఖ్యాత ప్రాచీన చారిత్రక, సాంస్కృతిక సరస్సు. 15 వ. శతాబ్దంలో లే లోయి అనే చక్రవర్తి సరస్సు మధ్యలో ఉన్న తన విశ్రాంతి మందిరంలో ఉన్నప్పుడు ఒక తాబేలు బంగారు ఖడ్గాన్ని ఆయనకు ఇచ్చినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. కిమ్ అంటే వియత్నమీస్ భాషలో కత్తి అని అర్థమట. ఆ భాషను టీ r యంగ్ వియెట్ అని పిలుస్తారు. అది వాళ్ళ మాతృభాష. దాదాపు తొంభై శాతం ప్రజలు మాట్లాడుతారట. దాని కర్తవ్యం చైనా దండయాత్రను ఎదుర్కోవడం అని గైడ్ లియాన్ చెప్పింది.
అక్కడి నుంచి రైలు వీధికి వెళ్ళాం. ఇది కూడా చారిత్రక ప్రదేశమే. సుమారు వందయేళ్ళ క్రితం ఫ్రెంచ్ వలసవాదులు ఏర్పాటు చేసిన రైలు మార్గం అట. జనసమ్మర్దం ఉన్న ఇళ్ళ మధ్యలో నుంచి రైలు వెళ్ళడం వింతగానే అని పిస్తుంది. నిరంతరం రైలు ట్రాక్ పైన జనం తిరుగు తూనే ఉంటారు. దానికి ఇరు వైపులా చిన్న చిన్న హోటల్స్, షాప్స్ ఉన్నాయి. వియత్నాం సంప్ర దాయమైన కాఫీ, బీర్ అక్కడ ప్రత్యేకంగా లభిస్తాయి. కొబ్బరి పాలతో చేసిన వియత్నాం ప్రత్యేకమైన కాఫీని రుచి చూసాను. ధర డెబ్భై వేల డాంగ్స్. వియత్నాం కరెన్సీని డాంగ్స్ అంటారు. 1000 VND కి సుమారు మన మూడు రూపాయల యాభై పైసలకు సమానం. ఖర్చు పెట్టిన ప్రతిసారి జాగ్రత్తగా లెక్కచూసుకోవలసి వచ్చింది. అక్కడ ఉన్నన్ని రోజులు వేలల్లో ఖర్చుపెట్టామని జోకులు వేసుకొని భలే ఎంజాయ్ చేశాం.
తర్వాత మేము హనోయ్ మెగా గ్రాండ్ వరల్డ్ కు వెళ్ళాం. రైలు వీధి పాత నగరంలో ఉంటే ఇది కొత్త నగరంలో ఉంది. ఖరీదైన హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కృత్రిమ సరస్సుకు ఇరువైపులా ఉన్న భవనాలు యురోపియన్ స్టైల్ లో ఉన్నాయి. దాని వల్ల యూరప్ చూసిన అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కరికి రెండులక్షల యాభైవేల డాంగ్స్ చెల్లించి బ్యాటరీ కార్ లో ఆ ప్రపంచమంతా చుట్టి వచ్చాం. చైనా , థాయ్ లాండ్ , కలకత్తా హౌరా బ్రిడ్జ్ , హైదరాబాద్ చార్ మీనార్, మరికొన్ని దేశాలు మోడల్ విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసారు. వీధులన్నీ విద్యుద్దీకరణలలో అలంకరించారు. అలంక రించారు. ఏదో వింత లోకంలోకి వెళ్ళినట్లుంది. ప్రకృతిని ప్రేమించే నన్ను అది అంతగా ఆకర్షించిలేదు.
మర్నాడు ఉదయమే ఆరున్నరకు హోటల్ నుంచి బయలుదేరి గంటలో హార్బర్ కు చేరుకున్నాం. ఆ రోజు హాలాంగ్ బేలో మా అమేథిస్ట్ డే క్రూయిజ్ ట్రిప్. అది ఎనిమిది గంటల ప్రయాణం. సుoగ్ సోట్ గుహలు, టిటోప్ ద్వీపం కయాకింగ్ చేస్తూ లుయాన్ కేవ్ లోకి వెళ్ళడం అనేవి ప్రధానమైనవి. క్రూయిజ్ పైకి వెళ్ళి అందమైన ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించాను. లంచ్ తర్వాత ముగ్గురమే సుoగ్ సోట్ గుహలోకి వెళ్ళాం. మొత్తం వెయ్యి మెట్లున్నాయి.మొదటి 250 మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆ ఇరుకైన గుహల్లోకి అక్కడక్కడా దూరి దూరి వెళ్ళడం భలే థ్రిల్లింగ్ గా ఉంది. వెళ్ళి రావడానికి మాకు గంట సమయం పట్టింది. ఆ ఉద్యోగం లోనుంచి తేరుకోకముందే క్రూయిజ్ లుయాన్ కేవ్స్ దగ్గరికి చేరుకుంది. బాంబు బోట్ లో కాసేపు షికారు చేసాం. తర్వాత కాసేపటికి టిటోప్ ద్వీపం చేరుకుంది. అది హనాయ్ లో ప్రఖ్యాత మైన బీచ్. జి. ఎక్స్ . అనే వ్యక్తి గ్రీన్ టెక్నాలజీస్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇండెక్స్ పరిశోధన వల్ల ఆ ద్వీపానికి టీ టాప్ అనే పేరు పెట్టి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారని క్రూయిజ్ గైడ్ రోజీ చెప్పింది. సాయంత్రం క్రూయిజ్ పైభాగంలో సూర్యాస్త మయాన్ని వీక్షించడం గొప్ప అనుభవం. తిరుగు ప్రయాణంలో డిన్నర్ చేసి హోటల్ కు చేరేసరికి రాత్రి తొమ్మిదైంది.





