యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో 108 కలశాలకు పూజలు నిర్వహించి పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను ప్రతిష్ట, అలంకారమూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చన జరిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *