– జిన్నింగ్ మిల్లుల హెచ్చరిక
– మిల్లుల ప్రతినిధులతో చర్చించండి
– వ్యవసాయ శాఖ కార్యదర్శికి మంత్రి తుమ్మల ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలు తమకు నష్టాలు కలి గించే విధంగా ఉన్నందున జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్ల ను నిలిపివేస్తామని అల్టిమెటం జారీ చేసిన నేపథ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో మాట్లాడాలని వ్యవసాయశాఖ సెక్రటరీని ఆదే శించారు. శుక్రవారం వ్యవసాయశాఖ సెక్రటరీ తో మాట్లాడిన మంత్రి తుమ్మల, సీసీఐ తీసుకొ చ్చిన ఎల్1, ఎల్ 2 నిబంధనలతో రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను సీసీఐ ఎండి దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యల పరిష్కారం దిశగా సీసీఐ ప్రతినిధు లతో మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రైతులు ఇప్పటికే అకాల వ ర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీసీ ఐ వారు తీసుకొచ్చిన తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి అనే నిబంధనలు రైతులకు ముందు కాళ్లకు బంధం వేసినట్టు, గుదిబం డలా తయారయ్యి, పంటను అమ్ముకోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నా రు. గత కొంతకాలం నుండి ఇప్పుడిప్పుడే ఎండ తీవ్రత పెరిగి, పత్తిలో తేమ శాతం తక్కువ ఉం డే సమయంలో, ఇపుడు జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపేస్తామని చెప్పడం రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయ ని అన్నా రు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎదుర్కొం టు సమస్యలపై ఇప్పటికే కేంద్రం జౌళిశాఖ మంత్రికి, సీసీఐ ఎండికి లేఖలు రాసినట్టు గు ర్తు చేశారు. అయినప్పటికి కేంద్రం నుండి ఎ లాంటి స్పందన లేదని, అయినప్పటికి జిన్నింగ్ మిల్లుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అందుకోసం రాష్ట్ర అధికారులను ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులపై ఒత్తిడి తెచ్చేలా వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కేంద్ర జౌళి శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి జిల్లా వారీ సగటు పత్తి దిగుబడిని లెక్కించేలా కలె క్టర్లకు వెంటనే ఆదేశాలవ్వాని వ్యవసాయశాఖ సెక్రటరీని మంత్రి తుమ్మల ఆదేశించారు. గత సంవత్సరం దిగుబడిపై 10% పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లు గా నిర్ణయించారని కేంద్ర జౌళిశాఖ అధికారు లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. అయితే చాలా జిల్లాలలో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్లు అంచనాల నేపథ్యంలో పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్ల నుండి 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలన్న మంత్రిగారి విజప్తి మేరకు కేంద్ర జౌళిశాఖ జాయింట్ సెక్రటరీ రాష్ట్రంలో ఎకరానికి సరాసరి పత్తి దిగుబడి గణాంకాలని లెక్కించి పంపించాలని కోరడం జరిగింది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు జిల్లావారీ వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు వెంటనే సేకరించి పంపేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సెక్రటరిని మంత్రి తుమ్మల ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





