వర్షం ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి :మేయర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆశ్రయించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. గురు,వారం మొదలైన వర్షం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్‌ విజయలక్ష్మి నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్నాయని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. నగరవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ, హైడ్రా బృందాలు ప్రజల నుంచి ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆమె ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *