జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల

– డివిజన్లు 150 నుంచి 300 పెంపు
– జోన్లు 6 నుంచి 12కి విస్తరణ
– కొత్త జోనల్ కమిషనర్ల నియామకం

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మ రింత బలోపేతం చేస్తూ ప్రభు త్వం అత్యంత కీలకమైన పున ర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. పెరుగు తున్న నగర జనాభాకు అనుగుణంగా పౌర సేవ -లను వేగవంతం చేసే ఉద్దేశంతో జిహెచ్ఎంసి డీలిమిటేషన్కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నూతన సంస్కరణల ప్రకారం భాగ్యనగరంలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేవలం డివిజన్ల సంఖ్యనే కాకుండా, పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 6 -జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచుతు న్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కా జగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ప్రాంతాలు కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా వార్డుస్థాయి కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు, ప్రస్తుత సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ పునర్విభజన అత్యంత పారదర్శకంగా సాగిందని, ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రజల నుండి సుమారు 6,000కు పైగా అభ్యంతరాలు రాగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతనంగా ఏర్పాటైన 12జోన్లకు పాలనా సారథులుగా ప్రభుత్వం సమర్థులైన అధికారులను కమిషనర్లుగా నియమించింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవరావు, కూకట్ పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ కు సందీప్ సుల్తానియా బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా చార్మినార్ జోన్కు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, మల్కాజగిరికి సంచిత్ గంగ్వార్, ఎల్బీ నగర్కు హేమంత్ కేశవ్ పాటిల్ నియమితులయ్యారు. ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధిక గుప్త, సికింద్రాబాద్కు రవికిరణ్, గోల్కొండ జోన్ కి  ముకుందరెడ్డిలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్లవాత్మక మార్పుల ద్వారా నగర పాలన నేరుగా ప్రజల ముంగిటకే వెళ్తుందని, మౌలిక సదుపాయాల కల్పన,ల పరిష్కారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం పుంజుకుంటుందని అధికారు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *