– రూ.11,460 కోట్ల బడ్జెట్ ప్రకటన
– ఫిబ్రవరి 10తో ముగియనున్న పదవీకాలం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గ్రేటర్ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యం లో శనివారం చివరి కౌన్సిల్ సమావేశం జరి గింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో వివిధ పార్టీల కార్పొరేటర్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ అప్పుల పాలైందని, అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి నచ్చచెప్పడంతో ఇరు పార్టీల కార్పొరేటర్లు సర్దుమణిగారు. అనంతరం 2026-27 బడ్జెట్కు కౌన్సిల్ ఆ మోద ముద్ర వేసింది. బడ్జెట్ పద్దుల్లో జీహె చ్ఎంసీకి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం: రూ.6,441కోట్లుగా చూపారు. ఇందులో జీహెచ్ఎంసీ ఖర్చు రూ.4,057కోట్లు, రెవె న్యూ మిగులు రూ.2.384 కోట్లు, జీహెచ్ఎంసీ రెవెన్యూ గ్రాంట్స్ రూ.400 కోట్లుగా చూపారు. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం కేటాయింపులు: రూ.2,260 కోట్లుగా చూపారు. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ : రూ.1,860 కోట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ ‘ఇది మా చివరి సమావేశం. భావోద్వేగంతో కూడుకున్నది. ప్రతి నిర్ణయం వెనుక బాధ్యత కనిపించింది. ఉద్యోగులు, సిబ్బంది సమర్థంగా పని చేశారు. నగర అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది. అంతా కలిసికట్టుగా పని చేశారు. ప్రజలకు మెరుగైన సేవల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. జాతీయస్థాయిలో అవార్డులు, రివార్థులు లభించాయి. పదవి ముగిసినా నా బాధ్య త మరువను. నగరం మరింతగా అభివృద్ధి చెందేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




