హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో బుధవారం సాయంత్రం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 36 గంటల్లో వర్షపాతం 80-150 మి.మీ వరకు ఉండవచ్చునని తెలిపింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమేరకు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, నీటిమునిగిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని ప్రజలకు సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సహాయం కోసం 040-21111111 లేదా అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.
@%TelanganaCMO
@PrlsecyMAUD
@CommissionrGHMC
#GHMC
#WeatherAlert
#HyderabadRains
#WeatherAlert
#GHMCUpdates
#HyderabadRains
#StaySafe
#TrafficAdvisory
#TelanganaNews
జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాతావరణ హెచ్చరిక





