తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందండి

– కిసాన్‌ మేళాలో అయిల్‌ పాం సాగుపై అవగాహన
– రైతులకు ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా సూచనలు

చేగోరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలనందించి ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలని రైతులను ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా చేగోరు మండలం కన్నహలో జరుగుతున్న రెండు రోజుల కిసాన్‌ మేళాలో రెండో రోజు ఆయిల్‌ పామ్‌ తోటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవరెడ్డి రైతులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయిల్‌ పాం సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, వ్యవసాయంలో అనుభవం వున్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల సంక్షేమాన్ని నిరంతరం ఆలోచిస్తూ ఆయిల్‌ పాం హబ్‌గా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఆయిల్‌ పాం రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రైతు నేస్తం అవార్డు గ్రహీత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడులతో ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్రంలోని రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆయిల్‌ పావమ్‌ తోటలపై అవగాహన ఉన్న అధికారి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ ఎలా సాగుచేసుకోవాలో సూచించారు. సదస్సులో ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ ఓఎస్డీ అడప కిరణ్‌ కుమార్‌, ఓపీడీ మేనేజర్‌ ప్రవీణ్‌ రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *