వైద్య పరికరాల యూనిట్‌ ఏర్పాటుకు సహకరిస్తాం

– తనను కలిసిన జర్మనీ కంపెనీకి సీఎం హామీ

హౖౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: రాష్ట్రంలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జర్మనీకి చెందిన బెబిగ్‌ మెడికల్‌ కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో జార్జ్‌ చాన్‌ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆ బృందం తెలిపింది. ఈమేరకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌తోపాటు, క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *