ఆటో సర్వీసులకు గ్యాస్‌ ‌కొరత

– తక్షణమే సమస్య పరిష్కరించండి
– కేంద్ర మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ కి మంత్రి ఉత్తమ్‌ ‌లేఖ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31: హైదరాబాద్‌లో ఎల్‌పీజీ ఆటోరిక్షాలు ఎదుర్కొంటున్న గ్యాస్‌ ‌కొరతపై కేంద్ర మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు ఎల్‌పీజీ సరఫరా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. గృహ అవసరాల కోసం డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సరఫరా 100 శాతం కొనసాగించాలని కోరారు. కమర్షియల్‌ ఎల్‌పీజీ పంపిణీపై కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆటో ఎల్‌పీజీ రంగం తీవ్రంగా ప్రభావితమైందన్నారు. తెలంగాణలో సుమారు 1 లక్ష ఎల్‌పీజీ ఆటోరిక్షాలు రోడ్లపై నడుస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల వాటా కేవలం 20శాతం మాత్రమే ఉంది. ప్రైవేట్‌ ‌కంపెనీలు 80 శాతం  మార్కెట్‌ను ఆక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 110 ప్రైవేట్‌ ఎల్‌పీజీ ఔట్‌లెట్లు ఉన్నాయి. రోజుకు సుమారు 55 మెట్రిక్‌ ‌టన్నుల ఆటో ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. అనేక ప్రైవేట్‌ ఔట్‌లెట్లు డ్రై అవుట్‌ ‌పరిస్థితి నెలకొంది. ప్రజా రవాణాలో అంతరాయం, ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ప్రైవేట్‌ ‌కంపెనీలకు ఖాఙల నుంచి సరఫరా అంతరాయం ఏర్పడిందని లేఖలో మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఔట్‌లెట్లలో ఆటో ఎల్‌పీజీ అందుబాటు ఉంచాలని విజ్ఞప్తి చేశార. ప్రైవేట్‌ ‌కంపెనీలకు తక్షణ సరఫరా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఔట్‌లెట్లలో లీటర్‌కు రూ.75, ప్రైవేట్‌ ఔట్‌లెట్లలో లీటర్‌కు రూ.93 వరకు విక్రయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ ‌లేఖలో పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై నియంత్రణ చర్యలు అవసరమని.. కేంద్రం తక్షణ జోక్యం వల్ల ప్రజా రవాణా సేవలు నిలకడగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *