– 37మంది దుర్మరణం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ప్లాటూ రాష్ట్రంలోని ఓ గనిలో ఆకస్మికంగా లెడ్ ఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌లు లీకయ్యాయి. పైగా గనిలో వెంటిలేషన్ కూడా తక్కువగా ఉండడంతో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ విష వాయువులను పీల్చి 37మంది ప్రాణాలు కోల్పోగా మరో 26మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని అధికారులు హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నైజీరియా సర్కారు ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. గనిలో విష వాయువులు లీకవుతాయనే విషయంలో అవగాహన లేకపోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి మంత్రి చెప్పారు. ప్రమాదానికి కారణమైన గని సక్రమమైనదా, అక్రమమైనదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.