– ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
దిల్లీ, నవంబర్ 24 : : దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబుకుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్ లామారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. తమ ఉద్యోగుల్లో సగం మందిని ఇంటి నుంచే పని చేసేలా.. మిగతా సగం మంది ఆఫీసుకు వచ్చేలా చూడాలని ఆయా సంస్థలను కోరింది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5లో పేర్కొన్న నిబంధనలన ప్రకారం పర్యావరణ శాఖ, అటవీ శాఖ ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. చలికాలంలో కాలుష్యం తీవ్రత ఆందోళన రేకెత్తిస్తోంది. పీఎం2.5, పీఎం10 నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా నమోద య్యాయి. దాంతో, రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని సదరు సంస్థలకు ఢిల్లీ గవర్నమెంట్ తేల్చి చెప్పింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





