– 10 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్, ప్రజాపతంత్ర, జనవరి 6: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒకచోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. హైదరాబాద్ లో ఈగల్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నేచర్ క్యూర్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర రూ. ఐదు లక్షల విలువజేసే 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రగ్స్ సప్లై చేస్తున్న మైనర్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మైనర్ బాలుడు ముంబై డ్రగ్ సిండికేటర్లకు డ్రగ్ ట్రాన్స్పోర్టర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆర్థికంగా బలహీనుడైన బాలుడిని వినియోగించుకొని ముంబై ముఠా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని మైనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఆఖా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పరారీలో ఉన్న ముంబై డ్రగ్ సరఫరాదారుల కోసం ఈగల్ టీం గాలింపు చేపట్టింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


