– హిందూ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం
ఢాకా ,ఫిబ్రవరి 23: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, అకృత్యాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. చాంద్‌పుర్ జిల్లాలో హిందూ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రాంతంలో స్ప్నహ కోల్పోయి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. స్థానికంగా నివాసం ఉండే రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. వారు తనను తీవ్రంగా హింసించి గాయపరిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు నిరసనలకు దిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



