రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయకచవితి

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రేవంత్‌ ‌దంపతులు

హైదరాబాద్‌,ఆగస్ట్ 28:‌వినాయక చవితి పర్వదినం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. వర్షాల కారణంగా మంటపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినా ప్రజలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. ఈ సందర్భంగా… జూబ్లీహిల్స్ ‌నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ ‌రావు పూజలు నిర్వహించారు.. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నేశ్వరునీ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రార్ధించనన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు.  క్ష తో తరుచేసిన విగ్రహాల వలన చెరువులు, జల వనరులు కలుషితం అవుతాయని,  వాటిని కాపాడేందుకు మట్టి వినాయకులను నిమజ్జనం చేయాలి అని ఆయన సూచించారు.  పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అందరు భక్తి శ్రద్ధలతో పాల్గోని ఘణంగా జరుపుకోవలని ఆయన కోరారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *