– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పర్యావరణానికి హాని చేయని సహజంగా లభించే మట్టి విగ్రహాల వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో అందరూ బాగస్వాములు కావాలని సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్ కమిుషనర్ సిహెచ్.ప్రియాంక కోరారు. సమాచార శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. రసాయనాలు, పీవోపీతో తయారు చేసిన గణపతి విగ్రహాలను వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందంటూ వాటి బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, జాయింట్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, సీఐఈ రాధాకిషన్, డిప్యూటి డైరెక్టర్లు ఎం.మధుసూదన్, సి.రాజారెడ్డి, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



