గాంధీ ఆరోగ్య జీవన విధానం ఒక యోగా

గత తొమ్మిది  సంవత్సరాలుగా యోగ డే పేరుతో మూడేళ్ల పిల్లల నుంచి మూడు కాళ్ళ ముసలి ముతక వరకు యోగా చేస్తూ సంవత్సరంలో ఒక వారం రోజుల హడావిడి చూస్తూనే ఉన్నాము.  జిల్లాల  కలెక్టర్లు, అధికారులతో   ఉదయాన్నే యోగ మ్యాట్ వాటర్ బాటిల్ తో ఎక్కడో  ఒక చోట  దర్శనమిస్తున్న  ఫోటోలు వార్త పత్రికలలో పుంఖాను  పుంఖాలుగా వొస్తున్నాయి. మరికొందరు పార్టీ కండువాలతో  పార్టీ రంగులతో కూడిన సూట్ తో యోగ చేస్తున్నారు.  యోగ చేసేది తక్కువ ప్రచారం ఎక్కువ చేసి చూపుతున్నారు. మన దేశం కనిపెట్టిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని సంతోషపడుతున్నారు. మనిషి చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని  సంపాదించుకుని  ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్నదని భ్రమలు కల్పిస్తున్నారు. దేశంలో సిద్ధ సమాధి యోగ, వివేకానంద యోగ, శ్రీ శ్రీ యోగ, పతంజలి యోగ, సద్గురు యోగ, రాందేవ్ బాబా యోగ, ఆరెస్సెస్ యోగ, కరసేవకుల యోగ, ఇలా  చెప్పుకుంటూ పోతే కొన్ని వేల రకాల యోగాలు దేశంలో వెలిశాయి. యోగా నేర్చుకోవాలనుకునే వారికి కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉండాలని గురుజీలు సెలవిస్తున్నారు.
 యోగ అనేది ఒక రకమైన వ్యాయామం కాదు. “యోగ” అసలు అర్థం ఐక్యత. ఆధునిక శాస్త్రం, ఈ మొత్తం ఉనికి ఒకే శక్తి అని రుజువు చేస్తోంది. కానీ మీరు దాన్ని ఆ విధంగా అనుభూతి చెందడం లేదు. మీరు ఒక ప్రత్యేక జీవి అన్న ఈ భ్రమని మీరు ఛేదిస్తూ, ఇంకా ఉనికి  ఏకత్వాన్ని అనుభూతి చెందితే, అదే యోగ. ఈ అనుభూతి వైపుగా మిమ్మల్ని తీసుకువెళ్లడానికి అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో ఆసనాలు అనేది ఒక అంశం. ఉపయోగ’ అనేది ఒకటి ఉంది. అది మీకు శారీరక ఇంకా మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది, కానీ ఆధ్యాత్మిక పార్శ్వాలను అంతగా తాకదు. ఉపయోగాకు ఆ స్థాయి నిబద్ధత అవసరం ఉండదు,  యోగాని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయడానికి ఉపయోగ అనేది ఒక సురక్షితమైన మార్గం. ఒకసారి ప్రజలు దాని ప్రయోజనాలను అనుభూతి చెందాక, సహజంగానే వాళ్ళు యోగాను మరింత సీరియస్ గా చేయాలనుకుంటారు  మరొకాయన సెలవిస్తారు.  మరికొందరు శాస్త్రీయత లేని  ఆహార అలవాట్లను, కషాయాలు, చిరుధాన్యాలు ప్రచారం చేస్తూ  వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా చలామణి అవుతున్నారు. పాలు తాగడం మాని కషాయాలు త్రాగమని ఇంకొకాయన సెలవిస్తాడు.
 తొంభయి   సంవత్సరాల క్రిందట జాతిపిత మహాత్మా గాంధీ ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం, ధ్యానం  పై ఒక నిర్దిష్టమైన అవగాహనతో ముందుకెళ్లారు.  మహాత్మాగాంధీ  నిరాడంబరతకు, నిర్మలత్వానికి మారు పేరు ఆ పావనమూర్తి. “అందరూ విలువను బంగారంలో, వెండిలోనూ వెతుక్కుంటారు. కానీ అసలైన విలువ అనేది మన ఆరోగ్యం లోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటారాయన. ఆధునిక కాలంలో అనేక విపరీతాలకు ఆలవాలమైన మన జీవనశైలి సరైన పంథాలో వెళ్లాలంటే ఆ మహనీయుని మాటలు మనకు ఆచరణయోగ్యం గా ఉండాలి.
తొంభయి   సంవత్సరాల క్రిందట జాతిపిత మహాత్మా గాంధీ ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం, ధ్యానం  పై ఒక నిర్దిష్టమైన అవగాహనతో ముందుకెళ్లారు.  మహాత్మాగాంధీ  నిరాడంబరతకు, నిర్మలత్వానికి మారు పేరు ఆ పావనమూర్తి. “అందరూ విలువను బంగారంలో, వెండిలోనూ వెతుక్కుంటారు. కానీ అసలైన విలువ అనేది మన ఆరోగ్యం లోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటారాయన. ఆధునిక కాలంలో అనేక విపరీతాలకు ఆలవాలమైన మన జీవనశైలి సరైన పంథాలో వెళ్లాలంటే ఆ మహనీయుని మాటలు మనకు ఆచరణయోగ్యం గా ఉండాలి. ఈ రోజు మహాత్మాగాంధీ గురించి ప్రపంచమంతా తెలుసు. అహింస, సహాయ నిరాకరణోద్యమం లాంటి విషయాల్లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా లాంటి ఎందరో మేధావులకు ప్రేరణగా నిలిచిన గాంధీ జీవితంలో ఆరోగ్య పరిరక్షణ అంటే ఏమిటి? మంచి ఆరోగ్య అలవాట్లు పెంచుకోవడమెలా? లాంటి విషయాల మీద కూడా పలు ప్రస్తావనలు ఉన్నాయి.  భారత స్వాతంత్య్ర సమరం  సాగుతున్న సమయంలో మహాత్మా గాంధీ అనేకసార్లు నిరాహారదీక్షను పాటించారు. దాదాపు 17 సార్లు ఉపవాసాన్ని ఒక వ్రతంగా స్వీకరించారు.
అత్యధికంగా 21 రోజులు కేవలం తక్కువ మోతాదులో ద్రవాలను మాత్రమే తీసుకుని నిరాహార దీక్ష చేశారు. తన అహింస సిద్ధాంతాల్లో భాగంగా ఈ అంశం గురించి పేర్కొన్నారు. పలువురు ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా సరైన విధానం  ద్వారా ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది అని పేర్కొనడం జరిగింది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడం, రక్తపోటును నియంత్రించుకోవడం, కొవ్వును తగ్గించుకోవడం లాంటివన్నీ కూడా పలు ఉపవాస నియమాల  వల్ల సాధ్యమే అని శాస్త్రం చెబుతోంది. ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం శరీరంలో మూడు రకాల జీవశక్తులు వాత, పిత్త, కఫ లక్షణాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.ఈ మూడు లక్షణాలు సమపాళ్ళలో పని చేయాలి అంటే వైద్యులు చెప్పే రీతిలో ఉపవాస నియమాలు పాటించడం మంచిది. విపరీతమైన యాంత్రిక జీవన విధానంలో శారీరక శ్రమ తక్కువయ్యింది, మానసిక ఒత్తిడి ఎక్కువయ్యింది. మంచి ఆరోగ్య, ఆహార అలవాట్లతో పాటు  శారీరక శ్రమతో కూడిన వ్యాయామం ఉంటే ఉత్తమం. కేవలం ప్రచార ఆర్భాటం కోసం చేసే ఏ కార్యక్రమం మనుగడ సాధించలేదు.
డా. ముచ్చుకోట. సురేష్ బాబు,
అధ్యక్షుడు, ప్రజాసైన్స్ వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *