– కేసీఆర్ కార్యాలయంపై దాడికి నిరసన
గజ్వెల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: గజ్వేల్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బంద్ సందర్భంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు దాడుల సమాచారం ఉందా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు హామీలపై దృష్టి సారించాలని సూచించారు. హామీలను మరిచి ప్రతిపక్షాలపై దాడులు చేయడమేంటని ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా వారి ఆఫీసుల్లో మోదీ ఫొటో పెట్టారా అని నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లోనూ సీఎం ఫొటో పెట్టిస్తారా అని ప్రశ్నించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణుల పిలుపు మేరకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంద్‌లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు బీఆర్‌ఎస్ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.