ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్

– అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడ నిధుల కేటాయింపు జరిగిందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్ద పీట వేసిందన్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించామని, దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ పధకం ద్వారా రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని దాదాపు కోటి 15లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుందన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించామని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకు వస్తున్నామని, ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టు వరకు విద్యార్థులు ఒకేచోట ప్రభుత్వ స్కూల్లో చదివే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అప్పులు, ఆదాయానికి సంబంధించి పారదర్శకంగా అన్ని వివరాలు వెల్లడించామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు. ఇందులో నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే 3.30 లక్షల కోట్లు చెల్లించామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వివిధ విభాగాల్లో ఉన్న లీకేజీలను అరికడుతున్నామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నామని సీఎం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *