– డాలర్ మారకం విలువ రూ.90.80కి క్షీణత
– రికార్డు కనిష్ఠానికి చేరిన భారత కరెన్సీ
న్యూదిల్లీ, డిసెంబర్ 15: భారత కరెన్సీ రూపా యి మారకం విలువ రోజురోజుకు మరింత పతనమవుతోంది. గతవారం వరుసగా రికార్డు పతనాన్ని చూసిన తర్వాత, సోమవారం రూపాయి విలువ ఇప్పటివరకు ఎన్నడూ లే నంత కనిష్ఠ స్థాయి రూ. 90.80కి క్షీణిం చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత కోలుకున్నప్పటికీ, అమెరికా డాలరుతో రూపా యి విలువ రూ. 90.74 వద్ద స్థిరపడింది. గత వారం ముగింపుతో పోలిస్తే సోమవారం రూపాయి ఏకంగా 25 పైసల నష్టాన్ని నమోదు చేసింది. ఇది ఆసియా కరెన్సీలలో అత్యంత బలహీనమైన కరెన్సీగా నిలిచింది.
పతనానికి ప్రధాన కారణాలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం, భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు భారీగా తరలి
పోతుండటం, దిగుమతిదారుల డిమాండ్: దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్కు భారీ డిమాండ్ ఉండటం, ప్రస్తుతం ఉన్న రిస్క్ కూడిన మార్కెట్ ధోరణి పెట్టుబడి దారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. హెచ్ డీఎఫ్సీ సెక్యూరిటీస్ పరిశోధన విశ్లేషకుడు దిలీప్ పర్మార్ మాట్లాడుతూ, ఊహించిన దానికంటే మెరుగైన వాణిజ్య గణాంకాలు నమోదైనప్పటికీ రూపాయికి మద్దతు లభించ లేదన్నారు. డిమాండ్-సరఫరా అసమతుల్య త, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ మరియు విదేశీ నిధులు తరలిపోవడం రూపా యిపై యిపై ప్రతికూల ప్రభావాన్ని వాన్ని కొనసాగిస్తు న్నాయని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి మారకం విలువ రూ. 90.95 వద్ద పడిపోయే అవకాశం ఉందని, లేదా రూ. 90.50 వద్ద స్థిరపడే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలరు ఇండెక్స్ రూ.98.23 వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 61.25 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


